Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒకే వేదికపై విభజన న్యాయబద్దం అని చెప్పగలరా? : సోమిరెడ్డి

రాష్ట్ర విభజనకు సంబంధించిన 11 అంశాల్లో దేనిపైన ఏకాభిప్రాయం ఉందని కేంద్రం ఏకపక్షంగా ముందుకు వెళ్తోందని కాంగ్రెస్ పార్టీ తీరుపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి ఒకే వేదికపైకి వచ్చి తెలంగాణ ఏర్పాటు న్యాయబద్దంగా ఉందని చెప్పగలరా? అని సవాలు విసిరారు. ఏకాభిప్రాయం లేకుండా రాష్ట్ర విభజన చేతకానప్పడు తక్షణమే విభజన ప్రక్రియను ఆపేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికలయ్యాక ప్రజల చేత ప్రధానిగా ఎన్నుకోబడిన వ్యక్తి దీని పరిష్కారం చూపుతాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సోనియా చేతిలో కీలు బొమ్మైన మన్మోహన్ సింగ్ వల్ల న్యాయం జరగదని ఆయన విమర్శించారు.

More Telugu News